కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జ్ఞాన ప్రకా ష్, రిజిస్ట్రార్ శరత్‌చంద్ర పేర్కొన్నారు. సోమవారం వారు యూనివర్సిటీ పరిధిలోని కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలను సందర్శించారు. కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్య అందించాలని, నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీన్ ఉదయ్‌కుమార్, విద్యార్థి విభాగం అధిపతి సతీష్‌కుమార్, అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) జిల్లా కార్యవర్గం ఎన్నికలను సోమ వారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు గా రమేష్‌గౌడ్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా జే.శివకుమార్ (ఎల్లారెడ్డి కళాశాల), ప్రధాన కార్యదర్శిగా ఎన్.రాములు (కామారెడ్డి కళాశాల) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు జయప్రకా ష్, ముస్తఫా, యాసిన్, శ్రీనివాస్‌రావు, శ్రీవల్లి, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూనె గింజల పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి జ్యోతి సూచించారు. కాచాపూర్‌లో ఉప సర్పంచ్ తొగరి దశరథం సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌ను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకూ నూనెలకు డిమాండ్ పెరుగుతోందని, ఆయిల్ పంటల సాగుకు ముందుకొచ్చి లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ ఉద్యాన అధికారి సుమన్, హెచ్‌ఈవో బాపురెడ్డి, హెచ్యూఎల్ సీనియర్ మేనేజర్లు శ్రీనివాస్‌గౌడ్, ప్రమోద్, క్లస్టర్ మేనేజర్ హేమకుమార్, క్లస్టర్ అధికారులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, శివ, మురళి తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండాలని అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరులో నిర్వహించిన మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత మహిళా సభ్యులు సంఘంలో లేనివారిని గుర్తించి వారిని సైతం పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని జయశంకర్ కాలనీలోగల యోగా భవన్‌లో వచ్చేనెల 2న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ అంశాలలో అండర్–10 నుంచి అండర్–55 వరకు బాలబాలికలు, మహిళలు, పురుషులకు వేరువేరుగా పోటీలుంటాయని పేర్కొన్నారు. వివరాలకు 99121 87508, 94400 37948, 96664 70472 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


