సాక్షి ప్రతినిధి, కామా రెడ్డి : భూ యజమానులకు రూ. 2.82 లక్షల పరిహారం ఇవ్వని విషయంలో తహసీల్ కార్యాలయ ఫర్నిచర్‌ను జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన రాజులు, శ్రీనివాసులు అనే వ్యక్తులు పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన భూమికి పరిహారం కోసం 1987లో బోధన్ కోర్టులో కేసు వేశారు. వారికి పరిహారం ఇవ్వాలని అప్పట్లో తీర్పు వెలువడింది. అయితే అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో గతేడాది సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి.. తహసీల్ ఆఫీసు ఫర్నిచర్ జప్తు చేయాలని ఆదేశించారు.
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 1,394.48 అడుగుల (6.489 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.


