‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిజాంసాగర్, గాంధారి, బాన్సువాడ, పెద్దకొడప్‌గల్, పిట్లం మండలాలతో పాటు కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి వివిధ స్థాయిలలో జరిగిన పనుల వివరాలను తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వేగంగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నిర్లక్ష్యం కనబరిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, డీపీవో మురళి, అధికారులు పాల్గొన్నారు.
నిర్మాణాలు పూర్తి చేయండి..
కామారెడ్డి క్రైం: ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగ తిపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలలు ఉంటే నిర్మాణాలకు అవసరమైన స్థలా న్ని వెంటనే గుర్తించి వారం రోజులలోగా మార్కవుట్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందన్నారు. పనుల అమలులో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, డీఈవో రాజు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డిలో 49 వార్డులు, బిచ్కుందలో 12, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయన్నారు. కామారెడ్డిలో 152, ఎల్లారెడ్డిలో 24, బాన్సువాడలో 39, బిచ్కుందలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఓపీవోల నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత నోడల్ అధికారులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి


