మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలి

Nov 30 2025 7:24 AM | Updated on Nov 30 2025 7:24 AM

మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలి

మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలి

కామారెడ్డి టౌన్‌: మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సీహెచ్‌ వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు. అంతర్జాతీయ మహిళల హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ, సమాజం మొత్తం బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.న్యాయ సహాయం అందించేందు కు న్యాయ సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి, నాగరాణి, న్యాయ మూర్తులు సుమలత, సుధాకర్‌,దీక్షా, న్యాయవ్యా ధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలను అరికట్టాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): బాల్యవివాహాలను అరికట్టాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సర్వీస్‌ అథారిటి జడ్జి నాగరాణి అన్నారు. స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో మహిళ అభివృద్ధి, సఖీకేంద్రం, జి ల్లాన్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాలు, గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌, తదితర వి షయాలపై అవగాహన కల్పించారు. ఈఅంశాలకు సంబంధించిన పోస్టర్ల ను ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ప్రమీల, కళాశాల ప్రిన్సిపల్‌ సురేఖ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement