కొనుగోలు కేంద్రాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నేడు గ్రామ సభలు డీఎఫ్‌సీఎస్‌ నిర్వహణ కమిటీ రద్దు దరఖాస్తుల ఆహ్వానం బిల్లులు రాక బడికి తాళం

బాన్సువాడ : బాన్సువాడ మార్కెట్‌ కమిటీలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అంజవ్వ బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. బీర్కూర్‌ మండలంలోని దామరంచలో సర్పంచ్‌ బోయిని శంకర్‌, బీర్కూర్‌లో సర్పంచ్‌ ధర్మతేజ, కిష్టాపూర్‌లో సర్పంచ్‌ మణెవ్వ, సంబాపూర్‌లో సర్పంచ్‌ రాంచందర్‌, బరంగెడ్గిలో సర్పంచ్‌ అనిల్‌కుమార్‌, బైరాపూర్‌లో సర్పంచ్‌ సుధారాణి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామ/వార్డు సభలు ని ర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సభల్లో చర్చించనున్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్‌ వరకు అల్పా హార పథకం, దివ్యాంగులైన ఇంటర్‌ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాల పంపిణీ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గుర్తించి, సమస్యల ప్రాధాన్యతను నిర్ణయించి రిజిస్టర్‌లో నమోదు చేయనున్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లా మత్స్యపారిశ్రామిక సంఘం(డీఎఫ్‌సీఎస్‌) నిర్వహణ కమిటీని రద్దు చేసినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి డోలిసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దసాయిలు, డైరెక్టర్లు చింతల సాయిలు, లత తమ పదవులకు రాజీనామా చేశారని, మరో నలుగురు డైరెక్టర్ల పదవీకాలం ముగిసిన కారణంగా పదవులు కోల్పోయారని వివరించారు. దీంతో సహకార చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కమిటీని రద్దు చేశామని పేర్కొన్నారు.

సహకార స్ఫూర్తికి విరుద్ధం..

డీఎఫ్‌సీఎస్‌ నిర్వహణ కమిటీని రద్దు చేయడం సహకార స్ఫూర్తికి విరుద్ధమని సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కమిటీలో 11 మంది ఉన్నారని, ఇందులో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారని, నలుగురి పదవీకాలం ముగిసిందని తెలిపారు. మరో నలుగురు సభ్యుల పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉన్నందున ఖాళీ అయిన ఏడు డైరెక్టర్‌ స్థానాలను భర్తీ చేసి కోరం ప్రకారం కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం కమిటీని రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: హైదరాబాద్‌లోని దుర్గాబా యి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు చేయడానికి ఆసక్తిగల బాలికలనుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైనవారు మే 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి ప్రమీల తెలిపారు. అనా థ బాలికలు, తల్లి లేదా తండ్రి లేని బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాలికలు, దివ్యాంగులు, తల్లి లేదా తండ్రి వదిలివెళ్లిన కనీసం పదో తరగతి చదివిన బాలికలు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని బాల రక్ష భవన్‌లో సంప్రదించాలని సూచించారు.

భిక్కనూరు: పాఠశాల గది నిర్మించి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ ఆ గదికి తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి. ఇసన్నపల్లిలో గత ప్రభుత్వ హయాంలో మన ఊరు –మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 16 లక్షలతో పాఠశాల గదిని నిర్మించారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు దీంతో గది నిర్మాణం కోసం చేసిన అప్పులు పెరిగిపోతుండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా సదరు కాంట్రాక్టర్‌.. పాఠశాల గదికి తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులు వరండాలో కూర్చోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement