● ముస్తాబైన ఆలయాలు
● వీరహనుమాన్ విజయ
యాత్రలకు ఏర్పాట్లు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో గు రువారం హనుమాన్ జయంతి ని ఘనంగా నిర్వహించనున్నా రు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలకు, భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని పెద్దబజార్ పురాతన హనుమాన్ ఆలయం, పంచముఖి హనుమాన్, శ్రీరామ్‌నగర్ కాలనీ, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాల ను విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తా బు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పలు ప్రాంతాలలో వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నారు.
జిల్లాకేంద్రంలో శోభాయాత్ర సాగుతుందిలా..
జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం హిందూ సంస్థల ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర చేపట్టనున్నారు. స్థానిక కోడూరు హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభమయ్యే శోభాయాత్ర.. పెద్దబజార్, రైల్వే కమాన్, నిజాంసాగర్ రోడ్, జన్మభూమి రోడ్, పాత సాయిబాబా రోడ్, కొత్త బస్టాండ్, అశోక్ నగర్ కాలనీ, పంచముఖి హనుమాన్ ఆలయం, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ల మీదుగా సాగి తిరిగి కోడూరు హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది. మహా ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రను విజయవంతం చేయాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. శోభాయాత్రలో హనుమాన్ మాలధారులు, భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


