ఖోఖో రాష్ట్ర జట్టుకు ఎంపిక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థి జీవన్‌దాస్ ఖోఖో రాష్ట్ర జట్టు కు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రా వు తెలిపారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర ఖోఖో పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. జీవన్‌దాస్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 29న అండర్–20 బాల, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎంపికైనవారు త్వర లో నిర్వహించే ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. బాలురు 75 కిలోలలోపు, బాలికలు 65 కిలోలలోపు బరువు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తిగలవారు పూర్తి వివరాలకు 93985 71110 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నాగిరెడ్డిపేట: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. చీనూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి రోజూ రెండు లారీలను ఏర్పాటు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. లారీలు కొనుగో లు కేంద్రానికి రాకముందే ధాన్యం తూకంచేసి సంచులను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకుల కు సూచించారు. అవకాశం ఉంటే కొనుగోలు కేంద్రంలో మరో హమాలీల బృందాన్ని ఏర్పా టు చేయాలని ఏపీఎం రాంనారాయణగౌడ్‌కు సూచించారు. ఆయన వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ సురేష్, సీసీ రవి తదితరులున్నారు.
తాడ్వాయి: మండల కేంద్రానికి చెందిన ఆకిటి రవీందర్‌రెడ్డి పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన లింగంపేట్ మండలంలోని బట్టిప్పతండా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనను రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నియమించినందుకు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: సర్వీస్‌లో ఉన్న భాషా ఉపాధ్యాయులకు భాషా సాహిత్య సంబంధ ప్రశ్నలతోనే టెట్ నిర్వహించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గఫూర్‌శిక్షక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో పండిత పరిషత్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సర్వీసులో ఉన్న పండిత పరిషత్ ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని వక్తలు పేర్కొన్నారు. టెట్ తప్పనిసరి అనుకుంటే భాషా పరిజ్ఞాన సాహిత్య అంశాలపైనే పరీక్ష ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో పరిషత్ ప్రతినిధులు రవికిరణ్, చంద్రశేఖర్, శ్యాంకుమార్, రఫియా తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: విద్యుత్ శాఖ ఎస్‌ఈగా బదిలీపై వచ్చిన రవీందర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన శ్రావణ్ కుమార్ పదోన్నతిపై వరంగల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. రవీందర్ నిజామాబాద్ నుంచి బదిలీపై కామారెడ్డికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు.
ఖోఖో రాష్ట్ర జట్టుకు ఎంపిక
ఖోఖో రాష్ట్ర జట్టుకు ఎంపిక
ఖోఖో రాష్ట్ర జట్టుకు ఎంపిక
ఖోఖో రాష్ట్ర జట్టుకు ఎంపిక


