‘జాగృతి’ జనంబాట!
● నేడు, రేపు జిల్లాలో
ఎమ్మెల్సీ కవిత పర్యటన
● ఏర్పాట్లు చేసిన నేతలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమం జిల్లాలో రెండురోజులపాటు సాగనుంది. ఇందులో భాగంగా ఆమె గురు, శుక్రవారాలలోజిల్లాలో పర్యటించనున్నారు. కవిత పర్యటన ఏర్పాట్లను జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్‌గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల్లో బీఆర్‌ఎస్ నేతలపై కవిత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఎవరిని టార్గెట్ చేస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. జిల్లాలో కవిత పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది..
● కవిత గురువారం ఉదయం 10.30 గంటలకు నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు.
● 11 గంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శిస్తారు.
● 12.30 గంటలకు బాన్సువాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడతారు.
● మధ్యాహ్నం 1 గంటలకు నాగిరెడ్డిపేటలో మంజీర ముంపు రైతులతో సమావేశమవుతారు.
● మధ్యాహ్నం 3.30 గంటలకు లింగంపేట మండల కేంద్రంలోని గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం అక్కడే ఉన్న నాగన్నగారి బావిని సందర్శిస్తారు.
● 4.30 గంటలకు తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమానికి వెళతారు.
● సాయంత్రం 6 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇటీవల రైలు వస్తుందన్న కంగారులో రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకిన ఘటనలో మృత్యువాతపడిన దేవునిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
● 28న జిల్లాకేంద్రంలో మేధావులు, వివిధ వర్గాలతో సమావేశం అవుతారు.


