రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలి
కామారెడ్డి క్రైం: రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు గౌరవించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


