శైవక్షేత్రాల్లో ‘కార్తీక’ పూజలు
సాక్షి నెట్‌వర్క్: జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాల్లో సోమవారం కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భిక్కనూరులోని సిద్దరామేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. పిట్లంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యలో సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామశివారులోని త్రిలింగరామేశ్వరాలయంలో శివలింగానికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలోగల పంచముఖ శివాలయంలో పంచామృత రుద్రాభిషేకం నిర్వహించారు. దోమకొండ మండలంలోని శివరాంమందిర్ ఆలయంలో లక్ష బిల్వాలతో అర్చన నిర్వహించినట్లు ఆలయ పూజారి రామకృష్ణశర్మ తెలిపారు.
శైవక్షేత్రాల్లో ‘కార్తీక’ పూజలు
శైవక్షేత్రాల్లో ‘కార్తీక’ పూజలు


