‘కేసుల పరిష్కారానికి కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్: కోర్టులలో ఈనెల 15వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో సాధ్యమైనన్ని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ వరప్రసాద్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కాంపౌండబుల్, క్రిమినల్, సివిల్, ఎన్‌ఐ యాక్ట్, వైవాహిక తగాదాలు తదితర కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేసుల వివరాలను ఈ ఫైల్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జడ్జి దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: పీఎం శ్రీ పథకంలో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు పొందిన చిన్నమల్లారెడ్డి ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ హన్మాండ్లు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు రాధారెడ్డి, రాజీవ్, వెంకటనర్సమ్మ చేతుల మీదుగా ఉత్తమ పీఎం శ్రీ అవార్డు స్వీకరించారు. చిన్నమల్లారెడ్డి ప్రాథమిక పాఠశాలలో 162 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. ఉత్తమ బోధన, సౌకర్యాలు, వాతావరణం, విద్యార్థుల ఆరోగ్యం, చదువు తదితర అంశాల్లో తమ పాఠశాల రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించిందని హెడ్‌మాస్టర్ హన్మాండ్లు తెలిపారు. అవార్డు అందుకున్న ఆయనను పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు అభినందించారు.
హైస్కూల్ కేటగిరిలో పాల్వంచ..
కామారెడ్డి టౌన్: హైస్కూల్ కేటగిరిలో పీఎం శ్రీ పథకం అవార్డుకు పాల్వంచ ఉన్నత పాఠశాల ఎంపికయ్యింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాకు చెందిన రెండు పాఠశాలలు రాష్ట్రస్థాయిలో టాప్ 5లో చోటు దక్కించుకోవడంపై డీఈవో రాజు హర్షం వ్యక్తం చేశారు.
కామారెడ్డి క్రైం: మరో నాలుగు నెలల పదవీకాలం ఉండగానే కామారెడ్డి జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. 32 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలు అందించిన ఆయన 2026 మార్చిలో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. కానీ 93 ఏళ్ల వయసున్న తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పూర్తి సమయాన్ని ఆమెతో గడపాల్సి వస్తోందని ఆయన తెలిపారు. అందుకే ముందుగానే ఉద్యోగ విరమణ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆయనను కలెక్టరేట్‌లో టీజీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మాగి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ప్రారంభమైంది. సీడీసీ చైర్మన్ షాదుల్ సోమ వారం ప్రత్యేక పూజలు చేసి క్రషింగ్‌ను ప్రారంభించారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు పండించిన రైతులు క్రషింగ్‌కు సహకరించాలన్నారు. ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు, కేన్ జీఎం వెంగళ్‌రెడ్డి, జీఎంలు శ్రీనాథ్‌రెడ్డి, రాజబాబు, సుబ్బారెడ్డి, సీడీసీ డైరెక్టర్లు అనితాసింగ్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘కేసుల పరిష్కారానికి కృషి చేయాలి’
‘కేసుల పరిష్కారానికి కృషి చేయాలి’
‘కేసుల పరిష్కారానికి కృషి చేయాలి’


