సంక్షిప్తం
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
దోమకొండ: మండంలోని గొట్టిముక్కుల గ్రామంలో సోమవారం సీసీ రోడ్డు పనులను ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. నాయకులు తిర్మల్‌గౌడ్, అనంతరెడ్డి, సంతోష్‌రెడ్డి, రామస్వామిగౌడ్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని పలు కాలనీలలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమైనట్లు కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలిపారు. ఇటీవల పనులు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆదేశాల మేరకు అధికారులు పనులు ప్రారంభించారన్నారు. పనులు ప్రారంభం కావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీధిదీపాలను ఏర్పాటు చేయాలి
భిక్కనూరు: మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే దారిలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని టీజీవీపీ మండలాధ్యక్షుడు భరత్‌రాజ్, సభ్యులు కోరారు. ఈమేరకు వారు సోమవారం గ్రామపంచాయతీ ఈవో మహేష్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. నేతలు విజయ్, కై ప్, రంజీత్, దేవేందర్‌లు పాల్గొన్నారు.
ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పార్టీ మండలాధ్యక్షుడు కుంట రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం గ్రామస్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ను పట్టణ అధ్యక్షుడిగా, ఐటీసెల్ ఇన్‌చార్జిగా తోకల నరేందర్‌లను నియమితులవగా, వారిని సన్మానించారు. రవీందర్ రావు, భూంరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని
కలిసిన నాయకులు
బాన్సువాడ: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్‌రెడ్డిని సోమవారం బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నాయకులు సతీష్, స్వరూప, శ్రీనివాస్, అంజయ్య, రాంబాబు, కృష్ణరెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక
భిక్కనూరు: మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపసర్పంచ్ అనురాధ భర్త లక్ష్మారెడ్డి సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. నాయకులు పొగాకు బాపురెడ్డి, మట్టె మహిపాల్‌రెడ్డి, పెంటల సత్యగౌడ్, మెరుగు రవి ఉన్నారు.
సంక్షిప్తం
సంక్షిప్తం
సంక్షిప్తం
సంక్షిప్తం


