అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్
● గుంతలో పడిన మహిళా కానిస్టేబుల్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా మారింది. ఏళ్లుగా బస్టాండ్‌లో నెలకొ న్న సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. బస్టాండ్ ప్రాంగణం, బస్సులు లోపలికి, బయటకు వెళ్లే దారిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చిన్న పాటి వర్షానికే నీరు చేరి గుంతలు కనిపించడం లే దు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఆ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. ఆదివారం రా త్రి ఓ మహిళా కానిస్టేబుల్ ఆర్టీసీ ప్రాంగణంలోని గుంతలో పడి గాయాపాలైంది. అటుగా వెళ్తున్న ప్ర యాణికులు గమనించి ఆమెను బయటకు తీశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


