అలరిస్తున్న గంగిరెద్దుల ప్రదర్శన
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గంగిరెద్దుల ప్రదర్శన ప్రజలకు ఆకట్టుకుంది. గంగిరెద్దుల వారు ఇంటింటి తిరుగుతూ అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దు చేత దండాలు పెట్టించారు. తదుపరి గంగిరెద్దుల వారికి ప్రజలు భిక్షపెడుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో గంగిరెద్దుల యాజమాని సిరిసిల్లా–రాజన్న జిల్లాకు చెందిన కొండాపూర్‌కు చెందిన భిక్షమయ్య మాట్లాడుతూ తమ కుటుంబం తరతరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామన్నారు. తనకు ఇద్దరూ కుమారులు ఉన్నారని వారు కూడా గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటల సీజన్‌లో తాము గంగిరెద్దులతో భిక్షాటన చేస్తామని తదుపరి కూలీ పనులకు వెళ్తామన్నారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డోంగ్లీ నుంచి కుర్లా, మదన్‌హిప్పర్గా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు మూడు ఫీట్ల లోతులో పెద్దగా ఉండటంతో అందులో నీరు చేరి చెరువులా తయారైందని వాహనదారులు పేర్కొంటున్నారు. అదుపు తప్పి కింద పడిపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
అలరిస్తున్న గంగిరెద్దుల ప్రదర్శన


