గంగమ్మ ౖపైపెకి! | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ ౖపైపెకి!

Oct 30 2025 9:14 AM | Updated on Oct 30 2025 9:24 AM

గంగమ్మ ౖపైపెకి! ఒకటో తేదీ నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ ‘ఐక్యత ర్యాలీని విజయవంతం చేయాలి’ ‘రైతులు నష్టపోకుండా చూడాలి’

న్యూస్‌రీల్‌

మండలాలవారీగా భూగర్భ జలమట్టం వివరాలు..

జిల్లాలో ఆరేళ్లలో నమోదైన వర్షపాతం వివరాలు..

గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

– 9లో u

కామారెడ్డి రూరల్‌: రేషన్‌ బియ్యం పంపిణీ నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తారు. 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేట్‌ 150వ జయంతి సందర్భంగా ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రంలో ఐక్యత ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి జన్మభూమి రోడ్డులోని వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు ఐక్యత యాత్ర నిర్వహిస్తామన్నారు. యువకులు, జాతీయవాదులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.

కామారెడ్డి రూరల్‌: అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన ఉగ్రవాయిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు జరపకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు. ఆయన వెంట జిల్లా సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, డీటీ కిష్టయ్య తదితరులున్నారు.

జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆగస్టు చివరలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనంతా వరద తాకిడితో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అన్ని చెరువులు, కుంటలు నిండాయి. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 885.5 మి.మీ. కాగా.. 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సాధారణంకన్నా 58.4 శాతం అదనంగా వర్షం కురిసింది. సుమారు రెండు నెలలుగా వానలు పడుతుండడంతో వాగులు, వంకలు ప్రవహిస్తూనే ఉన్నాయి. మంజీర జీవనదిగా మారింది. దీంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. గతంలో నీటి ఊటలు లేక ఎత్తిపోయిన బోర్లన్నీ ప్రస్తుతం ఎత్తిపోస్తున్నాయి.

12.90 మీటర్ల లోతునుంచి..

జిల్లాలో జూలై 26 నాటికి సగటు భూగర్భ జలమ ట్టం 12.90 మీటర్ల లోతులో ఉంది. ఇది ఆగస్టు 26 నాటికి 8.87 మీటర్లకు చేరింది. ఆగస్టు చివరి వారంలో దంచికొట్టిన వర్షాలతో భూగర్భ జలమట్టం మరింత ఎగబాకింది. సెప్టెంబర్‌ చివరలో 5.93 మీటర్లకు వచ్చింది. అక్టోబర్‌ 26 నాటికి 5.42 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయని భూగర్భజల శాఖ నివేదికలు పేర్కొంటున్నారు. కాగా గతేడాది ఇదే సమయంలో జిల్లాలో భూగర్భ జలమట్టం 8.62 మీటర్లుగా ఉంది. అంటే గతేడాది కన్నా ఈ ఏడాది 3.19 మీటర్లు ఎక్కువగా పెరిగిందని స్పష్టమవుతోంది. వాగులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిండా నీరుండడంతో ఇప్పటికిప్పుడు భూగర్భ జలమట్టం పడిపోయే పరిస్థితి కూడా లేదు. ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతుండడంతో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

లింగంపేటలో చేతికందే లోతులో...

లింగంపేట మండల కేంద్రంలో భూగర్భ జలమట్టం చేతికందే స్థాయిలోనే ఉంది. ఇక్కడ 0.18 మీటర్ల లోతులోనే నీరుందని భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా తాడ్వాయి మండలంలోని కన్కల్‌లో భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదు. ఇక్కడ 19.88 మీటర్ల లోతులో నీరుంది. జిల్లాలో ఇదే అత్యధిక లోతు అని అధికారులు వివరించారు.

రెండేళ్లదాకా ఢోకా లేనట్టే!

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. వాగులతో పాటు మంజీర నది నెలల తరబడిగా పారుతూనే ఉన్నాయి. నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ ప్రాజెక్టులు ఇప్పటికీ పొంగుతూనే ఉన్నాయి. జలాశయాలన్నీ జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈసారి జిల్లాలో కరువు ప్రాంతాలుగా పేర్కొ నే ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. దో మకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి, తదితర మండలాల్లో ఆగస్టు మూడో వారం వరకు అరకొర వర్షాలే కురిశాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. భూగర్భ జలాలు పెరిగి ఎత్తిపోయిన బోర్లన్నీ పోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో రెండేళ్ల దాకా ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు.

మండలం నీటిమట్టం

(మీటర్లలో)

మహ్మద్‌నగర్‌ 1.88

నస్రుల్లాబాద్‌ 2.2

పాల్వంచ 2.4

జుక్కల్‌ 2.05

మద్నూర్‌ 2.49

బాన్సువాడ 2.99

బీర్కూర్‌ 3.13

మాచారెడ్డి 3.65

లింగంపేట 3.82

సదాశివనగర్‌ 4

రామారెడ్డి 4.37

బిచ్కుంద 4.82

నిజాంసాగర్‌ 5.63

భిక్కనూరు 6.2

ఎల్లారెడ్డి 6.41

నాగిరెడ్డిపేట 6.68

పిట్లం 6.76

పెద్దకొడప్‌గల్‌ 7.03

రాజంపేట 7.1

గాంధారి 7.99

దోమకొండ 8.95

తాడ్వాయి 9.36

డోంగ్లీ 9.8

కామారెడ్డి 9.92

సంవత్సరం సాధారణం నమోదైనది వ్యత్యాసం

(మి.మీ.లలో) (మి.మీ.లలో) (శాతం)

2020–21 964.1 1,218 26.41

2021–22 1,029.0 1,280.8 24.43

2022–23 1,029.0 1,462.8 42.15

2023–24 1,029.0 1,114.6 8.31

2024–25 995.1 1,208.4 21.4

2025–26 (ఇప్పటివరకు) 885.5 1,402.7 58.4

జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పాతాళ గంగమ్మ పైకి పొంగుకొచ్చింది. భారీగా భూగర్భ జలాలు పెరిగాయి. లింగంపేట మండల కేంద్రంలో 0.18 మీటర్ల లోతులోనే నీరుండడం గమనార్హం. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో యాసంగితోపాటు వచ్చే ఏడాది పంటలకూ ఢోకా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాలో రెండు నెలలుగా భారీ వర్షాలు

సాధారణం కన్నా 58.4 శాతం

అధిక వర్షపాతం నమోదు

భారీగా పెరిగిన భూగర్భ జలమట్టం

5.42 మీటర్ల లోతులోనే నీరు..

గంగమ్మ ౖపైపెకి!1
1/2

గంగమ్మ ౖపైపెకి!

గంగమ్మ ౖపైపెకి!2
2/2

గంగమ్మ ౖపైపెకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement