ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి రూరల్: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా 195 యూనిట్ల రక్తం సేకరించి రెడ్‌క్రాస్ సొసైటీకి అందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీఐలు, ఎస్సైలు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, విద్యార్థులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.


