నిజాంసాగర్‌నుంచి నీటి విడుదల
నిజాంసాగర్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరిగి వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం 9,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.802 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 9,570 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు.
కౌలాస్‌లోకి..
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బుధవారం జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి 2,742 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల (1.237టీఎంసీలు) నిండుకుండలా ఉండడంతో రెండు వరద గేట్లను ఎత్తి 2,742 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నామన్నారు.
నిజాంసాగర్‌నుంచి నీటి విడుదల


