అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సదాశివనగర్ : అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీడీవోతో మాట్లాడి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారి వద్దకు వెళ్లి కారణం తెలుసుకోవాలని సూచించారు. నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థోమత లేక ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఐకేపీ ద్వారా రూ. 4 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అలాంటి వారు ఉంటే వెంటనే గ్రామ సంఘాలను సంప్రదించి రుణ సదుపాయం పొందాలని సూచించారు. అనంతరం తిర్మన్‌పల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ నిర్మాణాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సతీశ్ యాదవ్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీవోలు శ్రీనివాస్, ప్రసాద్, ఎంపీవో సురేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్, విండో చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాజన్న, బీరయ్య, జగ్గ బాల్‌రాజ్, కుమ్మరి రాజయ్య, రాజేందర్, సీసీ ఆంజనేయులు, సీఏలు మమత, పద్మావతి తదతరులు పాల్గొన్నారు.


