
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
బిచ్కుంద(జుక్కల్): మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేస్తున్న దుకాణదారులు, వ్యాపారులు తప్పకుండా వృత్తి వ్యాపార లైసెన్సు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేక్ హయ్యుం అన్నారు. పట్టణంలోని వ్యాపారులకు గురువారం ఆయన కొత్తగా లైసెన్సులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిచ్కుంద గ్రామం నుంచి కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిందని, గ్రామ పంచాయతి పేరుతో ఉన్న లైసెన్సు చెల్లదన్నారు. గ్రామ పంచాయతి, మున్సిపాలిటీ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని, కావును వ్యాపారులు లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాలన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సానిటరి ఇన్‌స్పెక్టర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.