
దోమకొండలో ఇద్దరు అదృశ్యం
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అదృశ్యమైనట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. దో మకొండకు చెందిన మా సుల నర్సింలు గురువారం మధ్యాహ్నం గేదెలను మేపడానికి వెళ్తు న్న అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి రాలేడు. ఆచూకీ లభించకపోవడంతో నర్సింలు భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే మండల కేంద్రానికి చెందిన చిట్యాల నవీన్ అనే వ్యక్తి గురువారం ఉదయం కుటుంబంలో గొడవల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈమేరకు అతడి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

దోమకొండలో ఇద్దరు అదృశ్యం