
చెరువులో పడి మహిళ మృతి
గాంధారి (ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పెద్ద పోతంగల్ గ్రామ సమీపంలోని గిద్ద చెరువులో గురువారం ప్రమాదవశాత్తు పడి దుర్కి సాయవ్వ (40) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయవ్వ భర్త ప్రసాద్‌కు ఇద్దరు భార్యలు. ఆయన మొదటి భార్యతో కలిసి నిజాంసాగర్‌లో ఉంటున్నాడు. సాయవ్వ ఇటీవల కూతురుకు పెళ్లి చేసి పెద్దపోతంగల్‌లో ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. మృతురాలి కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.