రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు

Oct 10 2025 7:56 AM | Updated on Oct 10 2025 7:56 AM

రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు

రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు

భూ కబ్జాలో ఏడుగురిపై.. మోసగించిన గల్ఫ్‌ ఏజెంట్‌పై..

గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని గండివేట్‌ గ్రామంలో రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత రేషన్‌డీలర్‌పై గురువారం 6ఏ కేసు నమోదు చేసినట్లు ఆర్‌ఐ ప్రదీప్‌ తెలిపారు. కొన్ని రోజులుగా రేషన్‌ డీలర్‌ గంగ వేధిత వినియోగదారులకు బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. గురువారం పౌరసరఫరాల డీటీ సురేశ్‌ దుకాణాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించగా 150 క్వింటాళ్ల సన్నబియ్యం, 66 క్వింటాళ్ల దొడ్డురకం బియ్యం తేడా వచ్చిందన్నారు. దీంతో డీలర్‌పై కేసు నమోదు చేసి మరో డీలర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కన్నాపూర్‌ శివారులో అటవీ భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు. అటవీ ప్రాంతంలో ఈ నెల 5న చెట్లను నరికివేసి, విధులకు ఆటంకం కలిగించిన ఎల్లేశం, భూమయ్య, వెంకటి, కవిత, సంతోష్‌, ధరత, సుజాతలపై అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మోపాల్‌: మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన బోధకుంట పోశెట్టిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జడ్‌ సుస్మిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోశెట్టి ఐదు నెలల క్రితం బోధన్‌లోని రాకాసీపేట్‌కు చెందిన ప్యాట విజయ్‌కుమార్‌ను మలేసియాకు పంపించాడు. కంపెనీ వీసా ఉందని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కంపెనీ వీసా కాదని, విజిట్‌ వీసా ఇచ్చి పంపినట్లుగా విజయ్‌కుమార్‌ గ్రహించాడు. ఏజెంట్‌ పోశెట్టి విజిట్‌ వీసా ఇచ్చి మోసం చేశాడని విజయ్‌కుమార్‌ భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోశెట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement