
పత్తి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి
మద్నూర్(జుక్కల్): పత్తి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని మేనూర్, మద్నూర్, డోంగ్లీ మండలంలోని మొగా గ్రామాల శివారులోని పత్తి, సోయా పంటను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి, ఏరువాక శాస్త్రవేత్తలు పరిశీలించారు. పొలం బడి శిక్షణ కార్యక్రమంలో భాగంగా పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశామని వారు తెలిపారు. పత్తి పంట బాగుందని తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవాలని వారు అన్నారు. అలాగే నిత్యం పత్తి పంటను పరిశీలిస్తు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. రైతులు వేసిన సోయాబీన్ కొత్త రకం బాగుందని పంట కోత తర్వాత వచ్చే ఏడాది పంట వేయడం కోసం కొన్ని విత్తనాలను ఉంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్తలు అనిల్‌రెడ్డి, రేవంత్, ఏవో రాజు, ఏఈవోలు అనిల్, విశాల్, సౌమ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పత్తి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి