
బేడ బుడగజంగల వివరాల సేకరణ
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామాన్ని గురువారం జిల్లా స్థాయి అధికారుల బృందం సందర్శించింది. అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామంలోని బేడ బుడగ జంగల స్థితి గతులు ఆచార వ్యవహారాల గురించి వివ రాలు సేకరించారు. ఈసందర్భంగా బేడ బుడగ జంగల కులస్తులు తమ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. తమకు గత కొన్నేళ్లుగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదన్నారు. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్ అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం గ్రా మానికి వచ్చామన్నారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి సతీష్ యాదవ్, మాచారెడ్డి తహసీల్దార్ సరళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతోబాటు బేడ బుడగ జంగల నాయకులు సాయిలు, వేణు, పరుశరాం, లక్ష్మిపతి,రవి,పోచయ్య,వెంకటి పాల్గొన్నారు.