
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణ
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులైనప్పటికీ.. అనర్హుల జాబితాలో పేరు వచ్చిన దరఖాస్తుదారులను సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారించారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. గతంలో ఆర్‌సీసీ ఇళ్లలో అద్దెకు ఉన్నవారితోపాటు గతంలో ఫోర్‌వీలర్స్ ఉండి ప్రస్తుతం అమ్ముకున్న పలువురు దరఖాస్తుదారులు అనర్హులుగా మారారు. వారంతా ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపడంతో తుదివిచారణ చేసి ప్రభుత్వానికి జాబితాను పంపించనున్నారు. విచారణ నిమిత్తం మండలంలోని బోర్లం, బోర్లంక్యాంపు, జక్కల్‌దాని తండా, గట్టుమీది గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటించారు. ఆమెవెంట ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, కేంద్ర సంఘం సభ్యులు, కే శివకుమార్ సమక్షంలో నామినేషన్లు స్వీకరించగా అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలైంది. దీంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సాయికృష్ణ, కార్యదర్శిగా నవిత, కోశాధికారిగా బి నరేందర్ ఎన్నికయ్యారు.
కామారెడ్డి అర్బన్: కరీంనగర్‌లో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన అటవీశాఖ రాజన్న జోనల్ స్థాయి క్రీడల్లో జిల్లా అటవీ విభాగం నుంచి డీఎఫ్‌వో బోగ నిఖిత క్యారమ్స్‌లో ప్రథమ స్థానం పొందారు. అలాగే కబడ్డీ మహిళ, పురుష విభాగం, వాలీబాల్ పురుష విభాగంలో, టగ్ ఆఫ్ వార్, షటీల్‌బ్యాట్, అథ్లెటిక్స్‌లో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై న వారిని డీఎఫ్‌వో నిఖిత అభినందించారు. జిల్లా అటవీ అధికారులు సునీత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 41,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు గురువారం తెలిపారు. ఐదు గేట్లను ఎత్తి 41,680 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు(17.8టీఎంసీల) కాగా, 1405 అడుగుల(17.8టీఎంసీల) పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ సిటీ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి తల్లి ద్వాదశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌లో బయల్దేరి ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కలెక్టరేట్ సమీకృత సముదాయం నుంచి కంఠేశ్వర్ బైపాస్‌లోని ఎమ్మెల్యే భూపతిరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బోర్గాం (పి) సమీపంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో జరిగే ద్వాదశదిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళతారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణ