
ఏటీసీల్లో మిషనరీలను బిగించాలి
ఎల్లారెడ్డి/బిచ్కుంద: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లలో అన్ని యంత్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధిస్తూ శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఎల్లారెడ్డి, బిచ్కుందలోని ఏటీసీలను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. బిచ్కుంద ఏటీసీలో మిషనరీని పూర్తిస్థాయిలో బిగించకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, ట్రైనర్లు నలుగురు మాత్రమే ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషనరీని పూర్తిస్థాయిలో బిగించి విద్యార్థులకు శిక్షణ తరగతులను ప్రారంభించాలని ప్రిన్సిపాల్ ప్రమోద్‌కుమార్‌ను ఆదేశించారు. ఏటీసీల పర్యవేక్షణ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్లు వేణుగోపాల్, ప్రేమ్‌కుమార్, ఎంపీడీవో గోపాల్, బిచ్కుంద ఏటీసీ ప్రిన్సిపాల్ ప్రమోద్‌కుమార్ ఉన్నారు.