
వైద్య సేవలు, టీకాలు సకాలంలో అందించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
● నగరంలో ప్రజారోగ్య సంక్షేమ
కార్యక్రమాలపై సమీక్ష
నిజామాబాద్ నాగారాం: ప్రజలకు సకాలంలో వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు అందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. నగరంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో వివిధ ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. మాతా, శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించడం. సీజనల్ వ్యాధులు, కీటకజనిత వ్యాధులను వ్యాప్తి చెందకుండా నియంత్రించడం. డెంగీ పాజిటివ్ గుర్తించబడిన ప్రాంతాలలో దోమల నివారణ చర్యలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రీ య బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ప్రతి టీం సంవత్సరంలో రెండు సార్లు ప్రతి అంగన్‌వాడీ కేందంలో, ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాలను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీబి ముక్తభారత్‌లో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్క సిబ్బంది పాల్గొనాలన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులన్నీ అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వైద్య సేవలు అందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డీటీసీవో దేవీ నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రమేష్, సమత, అశోక్, తుకారాం రాథోడ్, రాజు, శ్వేత, భార్గవి, వెంకటేష్, శిఖర తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవలు, టీకాలు సకాలంలో అందించాలి