లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన కొట్టంల భాగ్యలక్ష్మి(20) అనే వివాహిత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కూతురు భవ్యశ్రీ ఉన్నట్లు తెలిపారు. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొత్తపల్లిలో ఒకరు..
మాచారెడ్డి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బరిగే నాంపల్లి (54)కి కూతురు, కుమారుడు ఉండగా గతంలో మృతిచెందారు. ఈ బాధను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. దీంతో శనివారం రాత్రి పొలం వద్ద వేపచెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.