
ఎల్లారెడ్డిలో ప్రతియేటా..
బచ్‌పన్ దోస్తులను కలవ డం మరువలేని అనుభూతి. ప్రతియేటా బచ్‌పన్ దోస్తులను కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబం ఎంత ముఖ్యమో చిన్ననాటి స్నేహితులు కూడా అంతే ముఖ్యంగా అనిపిస్తుంది.
– రేవంతప్ప, ఏవో, కలెక్టరేట్, సిరిసిల్లా
నేను ఎల్లారెడ్డిలోనే బాల్యమి త్రులతో కలిసి ప్రభుత్వ పాఠ శాలలో చదువుకున్నాను. ప్ర స్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నాను. ప్రతియేటా బాల్యమిత్రులను కలిసేందుకు ఎల్లారెడ్డికి వస్తున్నాను. బాల్యమిత్రులను కలిస్తే ఎనలేని సంతోషం కలుగుతుంది. – నామ సంతోష్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాల 1992–93 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరూ పాల్గొని, ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన మిత్రులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వీరంతా జీవితంలో మంచి స్థానంలో స్థిరపడ్డారు. దీంతో బాల్యమిత్రులలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మిత్రులను కలిస్తే ఎనలేని ఆనందం కలుగుతుంది. బాల్యమిత్రులందరు వివిధ ప్రాంతాలలో ఉంటు ప్రతియేటా గెట్‌టుగెదర్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంటుంది.
– సిద్ధి శ్రీధర్, వ్యాపారవేత్త
ఎన్ని పనులున్నా చిన్ననాటి మి త్రులను కలుసుకునేందుకు ఏ ర్పాటు చేసిన ఈ కార్యక్రమాని కి తప్పకుండా వస్తాను. చిన్ననా టి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది.వారి తో సుఖసంతోషాలను పంచుకోవడం జరుగుతుంది.
– చెన్నకేశవులు, సీబీఐ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్
05 వైఎల్లార్ 138:

ఎల్లారెడ్డిలో ప్రతియేటా..

ఎల్లారెడ్డిలో ప్రతియేటా..

ఎల్లారెడ్డిలో ప్రతియేటా..

ఎల్లారెడ్డిలో ప్రతియేటా..