
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. లక్ష్మినగర్ తండాకు చెందిన భానోత్‌శంకర్ (55) ఆదివారం జంగంపల్లి గ్రామశివారులోగల జా తీయ రహదారి పక్కన సీతాఫలాలు విక్రయిస్తూ, తన టీవీఎస్ మోపెడ్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రిజా కారును డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడు. జంగంపల్లి శివారులో కారు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మనోహర్, నిశాంత్‌లకు గాయలయ్యాయి. అనంతరం కారు సీతాఫలాలు విక్రయిస్తున్న బానోత్‌శంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైవివరించారు.