ఆర్మూర్‌టౌన్/రుద్రూర్: ఆర్మూర్ పట్టణంలోని దు ర్గామాతా శోభాయాత్ర ఆదివారం మూడో రోజూ కొనసాగింది. పట్టణంలో పలు మండపాల నిర్వాహకులు దుర్గామాత్ర శోభాయాత్రను డీజే పాటల తో, డప్పువాయిద్యాలతో దండియా ఆటలతో ని ర్వహించారు. యువ యూత్ నిర్వాహకులు దుర్గా మాత నిమజ్జనం కోసం లక్నో నుంచి అఘోరాల వేషధారణ విన్యాసకులను రప్పించారు. వీరి చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్స్ యూత్ సభ్యు లు కాశీ తరహాలో గంగాహరతి కార్యక్రమం నిర్వ హించారు, రజక సంఘం ఆధ్వర్యంలో కళాకా రు లు కాళికామాత వేషధారణలో అలరించారు. ము న్సిపల్ ఆధ్వర్యంలో గూండ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ సహయంతో దుర్గామాత విగ్రహాలను ని మజ్జనం చేశారు. అలాగే కోటగిరిలోనూ దుర్గామా త నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది.
అఘోరా వేషధారణలో కళాకారుడి విన్యాసాలు
కాళికామాత వేషధారణలో నృత్యం చేస్తున్న కళాకారిణి
గంగమ్మ ఒడికి దుర్గామాత
గంగమ్మ ఒడికి దుర్గామాత
గంగమ్మ ఒడికి దుర్గామాత