
డోంగ్లీలో తాగునీటికి తంటాలు
మద్నూర్(జుక్కల్) : వేసవి కాలంలో తాగునీటి సమస్య రాలేదు కానీ ఇప్పుడు తాగునీటికి తంటాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డోంగ్లీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో కొద్దిగా నీళ్లు వస్తున్నాయి.. మరికొన్ని కాలనీల్లో అసలుకే నీరు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. డోంగ్లీలో గుట్టపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా పక్క గ్రామాలకు తాగునీరు అందిస్తున్నా డోంగ్లీలో మాత్రం తాగునీటికి కష్టం అవుతుందని స్థానికులు తెలిపారు. పలుచోట్ల పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నాయని, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.