
తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
కామారెడ్డి రూరల్: మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులకు నెల రోజులుగా తాగు నీరు రాకపోవడంతో వారు శనివారం కామారెడ్డి–సిరిసిల్ల్లా బైపాస్ వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్ డీఈ, ఏఈ రావాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ తన సిబ్బందితో అక్కడ చేరుకొని డీఈ, ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం డీఈ హనుమంతరావుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఈ హనుమంతరావు మాట్లాడుతూ.. వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.