
ఎన్నికల విధులపై అవగాహన ఉండాలి
నిజామాబాద్ రూరల్: ఎన్నికల విధులపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ఽ సూచించారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శనివారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారులకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవోలు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు పాల్గొన్నారు.