● నవరాత్రి ఉత్సవాల్లో 19 ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు
● సీపీ పోతరాజు సాయిచైతన్య
ఖలీల్‌వాడి: మహిళలు, బాలికలకు అండగా నిజామాబాద్ షీటీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో మహిళలను ఆకతాయిలు వేధించగా 19 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు యువతులకు, విద్యార్థులకు, పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చైతన్యపరిచినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో షీటీం బృందాల ద్వారా 11 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 80 హాట్ స్పాట్‌లను తనిఖీ చేశామని, పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఏడుగురికీ కౌన్సెలింగ్ ద్వారా కేసులలో పరిష్కారం చూపబడిందన్నారు. ఎవరైనా షీటీమ్ బృందాలను సంప్రదించాలంటే 87126 59795ను సంప్రదించాలన్నారు.