
పోగొట్టుకున్న పర్సు అందజేత
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఓ వ్యక్తి పొగొట్టుకున్న పర్సును తాడ్వాయి పోలీసులు అందజేశారు. లింగంపేట్ మండలంలోని భవానిపేట గ్రామానికి చెందిన సాతెల్లి నరేష్ అనే వ్యక్తి తన పర్సును ఈనెల 15న తాడ్వాయి మండలంలోని నందివాడలో పొగొట్టుకున్నారు. ఈ విషయమై తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. పర్సు ఓ వ్యక్తికి దొరకగా, అతడు తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో అందజేశాడన్నారు. అనంతరం పోలీసులు పర్సును పొగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. పర్సులో రూ. 200 నగదు, విలువైన కార్డులు ఉన్నాయన్నారు.
బాన్సువాడ: బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో పాము కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాన్సువాడ బ్లడ్ బ్యాంకు సిబ్బంది ఎల్లారెడ్డిలో రక్త దాన శిబిరం ఉండడంతో అక్కడి వెళ్లారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఫ్రిజ్‌లో పెట్టేందుకు సిబ్బంది సాయంత్రం వచ్చారు. సిబ్బంది వచ్చి బ్లడ్ బ్యాంకు గది తలుపులు తీసి చూడగా గదిలో శబ్దం రావడాన్ని గమనించారు. గదిలో ఓ మూలన పెద్ద జెర్రిపోతు పాము కంటపడింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వచ్చి పామును చంపేసారు. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంకులో రెండు సార్లు పాములు ప్రత్యక్షం కావడంతో సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంకు చుట్లూ పొదలు పెరిగిపోవడంతో అందులో నుంచే పాములు వస్తున్నట్లు సిబ్బంది అంటున్నారు. వెంటనే బ్లడ్ బ్యాంకు పరిసరాలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
పిట్లం(జుక్కల్): దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని కోరుతూ దివ్యాంగులు పిట్లం తహసీల్ కార్యలయం వద్ద మంగళవారం సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో సూచించిన విధంగా దివ్యాంగులకు రూ.4 వేల నుంచి 6 వేలకు పెంచి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 22 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు లోక శ్రీనివాస్, వెంకట సాయి, రారాజు, శ్రీనివాస్, బ్రహ్మం, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న పర్సు అందజేత

పోగొట్టుకున్న పర్సు అందజేత