
కిలోమీటర్‌కు రూ.500 చార్జి వసూలు
రామారెడ్డి: కిలోమీటరు దూరానికి ఆటో చార్జి మహా అయితే రూ.వందనో లేదంటే ఇంకా ఎక్కువలో ఎక్కువగా రూ.200 ఆటో చార్జి తీసుకుంటారు. కానీ అన్నారం నుంచి గొడుగుమర్రి జీపీకి అంగన్‌వాడీ స్కూల్‌కి సంబంధించిన వస్తువులు, అలాగే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బియ్యం ఇతర వస్తువులను ఆటోలో తీసుకెళ్లాలంటే రూ.500 చెల్లించాల్సిందే. అంత డబ్బులు చెల్లించినా ఆటోలు గొడుగుమర్రి తండాకు రావడానికి నిరాకరిస్తున్నారు. మట్టి రోడ్డుతో ఆటోలు చెడిపోతున్నాయని చెబుతున్నారు. కిలోమీటర్ దూరం నరకం చూపించే రోడ్డుతో విసిగిపోయిన ఆటో కార్మికులు అటువైపు వెళ్లడం లేదు. ఇటీవల గొడుగుమర్రి తండాకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు రాకపోవడంతో కంకర పోసి మధ్యలోనే వదిలేశారు. కొద్ది దూరం కంకర ఆ తర్వాత బురదలో ప్రయాణాలకు ఇబ్బంది కావడంతో అటువైపే ఆటోలు రావడం లేదు. స్కూల్, అంగన్‌వాడీ స్కూల్‌కు చెందిన బియ్యాన్ని ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే బైకులపై తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే బైకులపై సైతం ఈ రోడ్డుపై ప్రయాణం వీలుకాదు. దీంతో అన్నారం గ్రామంలో బైకులు పెట్టి ఉపాధ్యాయులు నడుచుకుంటూ గొడుగుమర్రి తండాకు వెళ్లి వస్తుంటారు.
గొడుగుమర్రి తండాలో దెబ్బతిన్న రోడ్లు
రోడ్లు బాగాలేకపోవడంతో
ఆ గ్రామం వైపు వెళ్లడానికి
జంకుతున్న ఆటోవాలాలు
ఎక్కువ చార్జి చేస్తున్న వైనం

కిలోమీటర్‌కు రూ.500 చార్జి వసూలు