
మళ్లీ దంచికొట్టిన వాన
న్యూస్‌రీల్
● ఇసాయిపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
● పొంగిపొర్లుతున్న వాగులు
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
– 9లో u
నేడు ప్రజాపాలన
దినోత్సవం
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని సూచించారు.
‘వరిలో తడి పొడి విధానంతో
పర్యావరణ పరిరక్షణ’
కామారెడ్డి రూరల్: వరి సాగులో తడి పొడి విధానాన్ని పాటించడం వల్ల పర్యావరణా న్ని పరిరక్షించవచ్చని జిల్లా వ్యవసాయ అధి కారి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవా రం అడ్లూర్‌లో పద్మపాణి సొసైటీ, కోర్‌కార్బన్ ఎక్స్ సంస్థల ఆధ్వర్యంలో రైతులకు వరిలో తడి పొడి విధానంపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ఈ విధానం వల్ల వరిలో మీథేన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు. తద్వారా ఎరు వులు సద్వినియోగం అవుతాయని, భూసా రం పెరుగుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నూతన విధా నాన్ని పాటిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 500 చొప్పున ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎక్స్ ప్రతినిధు లు కార్తీక్‌రావు, నీలేష్, చందు, పాండు, భీ ష్రం, పద్మపాణి డైరెక్టర్ సత్యనారాయణ్, ఏ ఈవో దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
‘సజావుగా పత్తి
కొనుగోలు చేయాలి’
కామారెడ్డి క్రైం : జిల్లాలో పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పత్తి విక్రయాల కోసం ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే ప్రత్యేక యాప్‌ను తీసుకువస్తోందని తెలిపారు. దాని ద్వారా రైతులు తమ ఇంటి నుంచే పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్లాలి, ఏ సమయంలో వెళ్లాలి అనే విషయాలన్నీ యాప్ ద్వారా రైతులకు తెలుస్తాయన్నారు. యాప్ అమలులోకి రాగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల నమోదు, కౌలు రైతుల వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ రోడ్డులో నిలిచిన వర్షం నీరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి, పాల్వంచ, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, నిజాంసాగర్, తాడ్వాయి తదితర మండలాల్లో భారీ వాన పడింది. వర్షంతో కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు పొంగి ప్రవహించాయి. కాగా వాగులు పొంగుతుండడంతో మరోసారి పంటలు నీటమునుగుతున్నాయి. గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తుండగా.. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికీ కొన్ని రూట్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. మరిన్ని వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది.
మళ్లీ మునిగిన పంటలు
నాగిరెడ్డిపేట : మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మళ్లీ పంటలు నీట మునుగుతున్నాయి. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరదనీటితోపాటు పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటితో నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, తాండూర్, వెంకంపల్లి, మాటూర్ తదితర గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. గత నెలాఖరున కురిసిన భారీవర్షాల కారణంగా మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో పంటలు నీటమునిగి భారీ నష్టం వాటిల్లింది. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మిగిలిన పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 55,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్ల ఎత్తి 61,542 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడం, ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నందున మంజీర నదీతీరం వైపు ఎవరూ వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల ఎప్పటికప్పుడు పెంచుతుండటంతో నదిలో ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మంజీరా నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టుకు మంగళవారం వ రద తాకిడి పెరిగింది. 3,854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీరు పోచారం ప్రాజెక్టు అలుగుపై నుంచి పొంగిపొర్లుతూ మంజీర నదిలోకి చేరుతోంది.
ప్రాజెక్టు సమాచారం..

మళ్లీ దంచికొట్టిన వాన

మళ్లీ దంచికొట్టిన వాన

మళ్లీ దంచికొట్టిన వాన

మళ్లీ దంచికొట్టిన వాన