
‘జాతీయ స్థాయిలో రాణించాలి’
కామారెడ్డి క్రైం : విద్యార్థులు జాతీయ స్థాయి యోగా పోటీల్లోనూ రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కేజీబీవీ విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. పలు విభాగాల్లో కలిపి 12 బంగారు, 3 రజత, 4 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో తొలిసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. వీరు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్ పాల్గొన్నారు.