
ఆయిల్‌పాం సాగుతో రైతులకు ప్రయోజనం
దోమకొండ: ఆయిల్‌పాం సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రతినిధి నసీంఅలీ అన్నారు. మంగళవారం అంబారీపేటలో ఆయిల్‌పామ్ సాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ తోటలు జనవరి నెలలో క్రాప్ కటింగ్ వస్తాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రాప్ కటింగ్ ఉంటుందని, కంపెనీకి పంపడం కోసం కనెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్‌గౌడ్, క్లస్టర్ మేనేజర్ హిమకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.