
వాహనాల తనిఖీ : పలువురికి జరిమానాలు
లింగంపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు చౌరస్తాలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలపై పెండింగ్ ఉన్న చాలన్‌లను చెల్లించాలని సూచించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు. కార్లలో ప్రయాణం చేసేవారు సీట్ బెల్టు ధరించాలని సూచించారు. ధ్రువపత్రాలు, హెల్మెంట్ ధరించని 10 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. అలాగే సదాశివనగర్ మండలం పద్మాజివాడి, మోడెగాం గ్రామాల చౌరస్తాల వద్ద ఎస్సై రంజిత్ వాహనాల తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో పీఎస్‌ఐ రాఘవేందర్, హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కొలతల ప్రకారం
పనులను చేయాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధిహామీ పథకంలో కొలతల ప్రకారం పనిచేసినట్లయితే పనికి తగ్గ వేతనం వస్తుందని మండల ప్రత్యేక అధికారి రా జారాం అన్నారు. మండలంలోని చిట్యా ల గ్రా మ శివారులో నడుస్తున్న ఉపాధిహామీ పనులను ఆ యన శుక్రవారం పరిశీలించారు. అనంతరం సంతాయిపేట్‌లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఎంపీవో సవితారెడ్డి, తదితరులున్నారు.