Telangana News: బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్‌ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్‌
Sakshi News home page

బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్‌ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్‌

Oct 5 2023 1:34 AM | Updated on Oct 5 2023 10:25 AM

- - Sakshi

మిత్రులతో గోడును విలపిస్తున్న సాయినాథ్‌

కామారెడ్డి: సీఎం కేసీఆర్‌ సార్‌ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన ఉపసర్పంచ్‌ చేసిన మెసేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్‌ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్‌ వాట్సప్‌లో తన వాయిస్‌ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్‌ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు.

తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్‌ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్‌ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్‌ నంబర్‌ ట్రేస్‌చేసి హైదరాబా ద్‌లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement