టీడీపీకి బై.. వైఎస్సార్‌ సీపీకి జై | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి బై.. వైఎస్సార్‌ సీపీకి జై

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

● పెద్దాపురం, సామర్లకోటల్లో

‘ఫ్యాన్‌’ కిందకు చేరిన నేతలు

● పార్టీ కండువాలు వేసి, స్వాగతం పలికిన కో ఆర్డినేటర్‌ దొరబాబు

పెద్దాపురం: మున్సిపాలిటీ పరిధిలోని పలువురు టీడీపీ సీనియర్‌ నాయకులు వైఎస్సార్‌ సీపీకి జైకొట్టారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు నేతృత్వంలో వారు బుధవారం ఆ పార్టీలో చేరారు. వారికి దొరబాబు పార్టీ కండువా వేసి సాదరంగా స్వాగతం పలికారు. తొలి నుంచీ టీడీపీలో ఉన్న కురందాసు దుర్గాప్రసాద్‌, మరికొంత మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, ఈ నెలలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఆయా వార్డుల్లో అన్ని వర్గాల వారినీ కలుపుకొనిపోతూ, వివాదాలకు దూరంగా ఉంటూ, పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పప్పల బుజ్జి, మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు కరీం జానీ, పార్టీ పట్టణ నాయకుడు పలివెల జనార్దన్‌, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బూరెడ్డి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోటలో..

సామర్లకోట: దవులూరి దొరబాబు ఆధ్వర్యాన సామర్లకోట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల నుంచి పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు. 30వ వార్డు నుంచి మార్నిడి సూర్య సత్య హరినాథ్‌, 4వ వార్డుకు చెందిన కాతేటి అరుణ కుమార్‌లకు దొరబాబు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ అయ్యరక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, దివ్యాంగ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి పిడుగు కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాగా సురేష్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఉబా జాన్‌మోజెస్‌, గుణ్ణం రాజబ్బాయి, మాజీ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు మన్యం చంద్రరావు, మున్సిపల్‌ వింగ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, పట్టణ యూత్‌, బీసీ, ఐటీ విభాగాల అధ్యక్షులు పెదిరెడ్ల కృష్ణ, రెడ్డి శ్రీనివాసరావు, దర్శిపాటి సత్యానందం, పట్టణ ఉపాధ్యక్షుడు బీవీ రమణ, నాయకులు నేతల హరిబాబు, పుట్టా సూరిబాబు, నాతిపాముల సూరిబాబు, చిట్టుమాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నుంచి దొరబాబు దరఖాస్తులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement