తొండంగి: మండలంలోని గోపాలపట్నంలో శనివారం పిచ్చికుక్క దాడిలో రెండేళ్ల బాలుడు సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపాలపట్నం ఎస్సీపేట, పాత ఊరు ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆ కుక్క ఎస్సీపేటలో రెండేళ్ల బాలుడు కాకాడ సంజీవ్‌రాయ్ తొడపై కరిచింది. అలాగే పలివెల లచ్చబాబు, పలివెల శరణ్య, వలజంగి రాజు, ఐదేళ్ల బాలుడు పోతుల నందకిషోర్‌ను సైతం తీవ్రంగా గాయపరిచింది. సరిహద్దు గ్రామం అన్నవరం శివారు సుబ్బరాయపురంలో బూసాల రాముడును సైతం గాయపరిచింది. దీంతో సంజీవ్ రాయ్, పలివెల లచ్చబాబు, శరణ్య, వలజంగిరాజులు సమీపంలో రావికంపాడు పీహెచ్‌సీకి వెళ్లగా వైద్యులు ఏఆర్వీ ఇంజెక్షన్ చేశారు. సంజీవ్‌రాయ్‌ను మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.


