ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–17, 19 ఆధ్వర్యంలో కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు శనివారం రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను కాకినాడ అర్బన్‌ ఎంఈఓ సీహెచ్‌ రవి ప్రారంభించారు. ప్రతిభను నిరూపించుకోవడానికి ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలను బాటగా మార్చుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అండర్‌–17, 19 కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. అండర్‌–19 బాలికల విభాగంలో దీక్షిత (పశ్చిమ), లేఖ్యశ్రీ (కడప), టి.అంకిత (తూర్పు) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. అండర్‌–17 బాలికల విభాగంలో బి.శ్రీచందన (కడప), భాగ్యశ్రీ (తూర్పు), పద్మావతి (పశ్చిమ) బంగారు, వెండి, రజత పతకాలు గెలుచుకున్నారు. 48 కిలోల విభాగంలో ఎం.పావని(పశ్చిమ), ఎం.తనీహ (శ్రీకాకుళం), కె.లిఖిత (తూర్పు)లు, అండర్‌–19 బాలుర విభాగంలో ఎస్‌కే అబ్దుల్‌ అషీద్‌ (కడప), వి.రామచరణ్‌ (విజయనగరం), ఎం.మురళి (శ్రీకాకుళం) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. రెండో రోజు విజేతలకు ఎంఈఓ రవి మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ సతీష్‌కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి మాచరరావు, పీడీలు రవిరాజు, బంగార్రాజు, కె.శ్రీనివాసరావు, పట్టాభి, వెంకటేష్‌, ఎస్‌జీఎఫ్‌ఐ అడ్మిన్‌ కార్యదర్శి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement