వరుణ యాగం.. వాన రాగం.. | - | Sakshi
Sakshi News home page

వరుణ యాగం.. వాన రాగం..

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

ఫ ద్వారకాతిరుమలలో వరుణయాగం ప్రారంభం

ఫ సాయంత్రం కురిసిన భారీ వర్షం

ద్వారకాతిరుమల: వర్షాలు సమృద్ధిగా కురిసి, పుడమితల్లి పచ్చని పైరులతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ద్వారకాతిరుమల క్షేత్ర పాలకుడైన భ్రమరాంబా మల్లేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం వరుణయాగం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు ఈ ప్రత్యేక క్రతువు నిర్వహించను న్నారు. తొలి రోజు వరుణదేవుని అనుగ్రహం కోసం పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమా లు చేపట్టారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పించారు. రుష్యశృంగ మహామంత్ర వరుణ జపాన్ని పండితులు వేదోక్తంగా జరిపించారు.

తడిచి ముద్దయిన ఆలయం

ద్వారకాతిరుమల క్షేత్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శ్రీవారి కొండపైన పలు ప్రాంతాలు కోనేరులను తలపించాయి. దీపారాధన మండపం వద్ద నీరు భారీగా నిలిచింది. వర్షం వెలిసిన అనంతరం క్రమంగా బయటకు ప్రవహించింది. ఎండలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న భక్తులకు కొంచెం ఉపశమనం లభించింది.

చిన వెంకన్నకు రెండో స్థానం

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై కంప్యూటర్‌ సహాయంతో ఫోన్‌ ద్వారా నిర్వహించిన అభిప్రాయ సేకరణ (సీఏటీఐ) సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం మరోసారి మెరుగైన స్థానాన్ని సాధించింది. అక్టోబర్‌కు సంబంధించిన సర్వేలో 71.9 శాతం పాజిటివ్‌ స్కోర్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. 72.4 శాతంతో విజయవాడ మొదటి స్థానంలో ఉండగా, 68.1 శాతంతో సింహాచలం మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ఈ నెల 5న విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.

నాలుగు అంశాలపై అభిప్రాయ సేకరణ

దర్శనం, తాగునీటి వసతి, ప్రసాదం రుచి–నాణ్యత, పారిశుధ్య నిర్వహణ అనే నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని భక్తుల అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. గత నెల 4 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నమోదైన స్పందనల ఆధారంగా తాజా ర్యాంకులను వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిర్వహించిన ఈ సర్వేలో ఓవరాల్‌గా దర్శన సంతృప్తి 72.3 శాతంగా నమోదైంది. ప్రసాదం రుచి, నాణ్యతకు 74.2 శాతం, పరిశుభ్రతకు 63.3 శాతం, తాగునీటి సౌక ర్యాలకు 63.2 శాతం పాజిటివ్‌ స్పందనలు లభించాయి. మొత్తంగా దేవాలయ సౌకర్యాలపై పాజిటివ్‌ స్కోర్‌ 68.2 శాతంగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement