గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరసన

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

కపిలేశ్వరపురం (మండపేట): తమ డిమాండ్ల సాధన కోసం మండపేట పోస్టాఫీస్‌ వద్ద సోమవారం భోజన విరామ సమయంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరసన తెలిపారు. వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని, డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులతో సమానంగా పెన్షన్‌, గ్రాడ్యుటీ, వైద్య సౌకర్యాలు కల్పించాలని, బలవంతపు టార్గెట్లను రద్దు చేయాలన్న డిమాండ్లతో నిరసన తెలిపామని సంఘం నాయకులు తెలిపారు. ఆల్‌ ఇండియా ఉద్యోగుల మాజీ కార్యదర్శి ఎస్‌ఎస్‌ మహదేవయ్య సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. సంఘం సీనియర్‌ నాయకుడు ఎండీఎం షరీఫ్‌, ఎ.గణపతి నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కేలీ నారాయణరావు, ఎ.వెంకటేశ్వరరావు, జి.వెంకట్రావు, ఎం.అనూష, ఎస్‌.దుర్గాదేవి, కె.అనూష, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement