పెద్దాపురం: కబడ్డీ సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటీల్లో పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థినులు ఆచంట మౌనిక శ్రీవర్షిని, వేటికూరి సుబ్బలక్ష్మి సత్తా చాటారు. వీరు 10 నుంచి పశ్చిమగోదావరి జిల్లా నూజివీడులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కాకినాడ జిల్లా తరఫున ఆడేందుకు అర్హత సాధించాలని పాఠశాల పీఈటీ కోట్నీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యార్థినులను హెచ్‌ఎం వెంకటరమణ, ఎస్‌ఎంసీ చైర్మన్ కంచుమర్తి వీరవేణి, వైస్ చైర్మన్ తాతపూడి సునీత కుమారి అభినందించారు.


