స్వామి దర్శనానికి వెళ్తే.. సర్దేశారు! | - | Sakshi
Sakshi News home page

స్వామి దర్శనానికి వెళ్తే.. సర్దేశారు!

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

● జవాన్‌ ఇంట్లో భారీ చోరీ

● నిడదవోలు మండలం రావిమెట్లలో ఘటన

నిడదవోలు రూరల్‌: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ జవాన్‌ ఇంటికి రాగా, కుటుంబమంతా ఎంతో సంతోషంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి దొంగతననానికి పాల్పడ్డారు. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో ఈ ఘటన సోమవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రావిమెట్ల గ్రామానికి చెందిన ఆకుల సుబ్బారావు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్న కుమారుడు నరేంద్ర ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సెలవులపై ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి మొక్కు తీర్చుకునేందుకు ఈ నెల 2న తిరుమల వెళ్లారు. ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని బీరువాలను బద్దలు కొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడేసి, అందులో దాచిన సుమారు 19 కాసుల బంగారు ఆభరణాలు, 80 గ్రాముల వెండి వస్తువులు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు తెరిచి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు సుబ్బారావుకు సమాచారం అందించారు. తిరుమల నుంచి హుటాహుటిన సోమవారం ఇంటికి చేరుకుని దొంగతనానికి గురైన సొత్తును చూసి కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సమిశ్రగూడెం ఎస్సై ఎల్‌.బాలాజీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి క్లూస్‌ టీమ్‌ సహాయంతో వేలిముద్రలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement