నారసింహుని సన్నిధిలో పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నారసింహుని సన్నిధిలో పవిత్రోత్సవాలు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

కోరుకొండ: స్థానిక శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత అర్చకస్వామి చంటిబాబు ప్రత్యేక పూజలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు 8వ తేదీ వరకూ జరుగుతాయని ఆలయ అనువంశిక ధర్మకర్త రంగరాజబట్టర్‌, దేవస్థాన అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఉదయం 6–45 గంటలకు వరుణజపం, వరుణయాగం నిర్వహిస్తారు.

సత్యదేవుని నిత్యాన్నదానానికి విరాళం

అన్నవరం: స్థానిక సత్యదేవుని దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి హర్యానా రాష్ట్రం గుర్గాన్‌కు చెందిన దాత ఆలపాటి వెంకట జయలక్ష్మి రూ.2 లక్షలను విరాళంగా సోమవారం సమర్పించారు. ఇందులో రూ.లక్షపై వచ్చే వడ్డీతో వి.వీరాంజనేయులు పేరుపై ఏటా పుష్యమాస శుక్ల పక్షం అష్టమి రోజున, మరో రూ.లక్షపై వచ్చే వడ్డీతో వి.సుబ్బరత్నమ్మ పేరుపై ఏటా ఘశుక్ల షష్టి రోజున అన్నదానం చేయాలని కోరారు. దాత తరఫున బంధువులకు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, అన్నదానం బాండ్‌లను అన్నదానం ఏఈఓ బలువు సత్యశ్రీనివాస్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement